Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

మత సామరస్యాలకు ప్రతీక పండుగలు:ఎంఎల్‌సి

christ

మన తెలంగాణ/కల్వకుర్తి: మత సామరస్యాలకు భంగం కలగకుండా పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సాయిబాలాజీ పంక్షన్‌హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో క్రైస్తవ బంధువులకు ప్రేమ విందు కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ది కోసం సంక్షే మ పథకాలను అమలు చేస్తు వారి సాంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరుపున దుస్తువులు,విందుబోజ నా లను తదితర సామగ్రిని అందిస్తుందిని ఆయన గుర్తు చేశారు. నియోజక వర్గంలోని అన్ని మండల,గ్రామాలలో వుండే 100 మంది పేద క్రైస్తవుల కు దుస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.క్రైస్తవ ఫాద ర్‌లు నియోజకవర్గంలో క్రైస్తవ కమ్యూనిటీ భవనం కోరడంతో స్థలాన్ని గుర్తించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.అందరు విద్యను అభ్యసించి అన్ని రంగాలలో వృద్ది చేందాలని ఏసు ప్రభువు సూ చించిన మార్గాన్ని పాటించాలని ఆయన కోరారు.అనంతంరం ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం చివరకు భగవంతుని వద్ద కు చేరడం తప్పదని ఈ మధ్య కాలంలో సేవా,ప్రేమ గుణాలను పది మందికి పంచుతు మంచిని ప్రోత్సహిస్తు ముందుకు సాగాలన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో క్రిస్టియిన్ భవనాలను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని తాను ముఖ్యమంత్రిని కోరుతానని తెలిపారు. అనం తరం మైనార్టీ జిల్లా వెల్ప్‌ర్ అధికారి సప్తగిరి మాట్లాడుతూ మైనార్టీలు అంటే ముస్లింలే కాదు క్రైస్తవులు,.జైనులు,బౌద్దులు తదితర కులాలలు మైనార్టీ కిందికి వస్తాయని వీరందరికి కళ్యాణ లక్ష్మి,ప్రార్థనా మందిరా ల నిర్మాణాలు, మరమత్తులకు ,విద్యా ఉపాధి కోసం శిక్షణ కేంద్రాలు వున్నాయని వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. అనంతరం సెమి క్రిస్‌మస్ సభ్యులు రామస్వామి ,ప్రసాద్,ప్రేమ్ కుమార్,రాజు,జాన్,ఆనంద్ తదితరులు ప్రజాప్రతినిధులను, అధికారు లను సన్మానించారు.అనంతరం అందరు కలిసి క్రిస్‌మస్ కేకును కట్ చేసి అందరు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పేద క్రైస్తవు లకు దుస్తువుల కిట్లను పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి రామేశ్వరమ్మ,జెడ్పీటిసి అశోక్‌రెడ్డి,నగర చైర్మన్ శ్రీశైలం,కౌన్సిలర్ ఆనంద్‌కుమార్,సూర్యప్రకాశ్‌రావు,ఆర్డీఓ రాజేశ్‌కుమార్,తహసిల్దార్ మంజుల,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు విజయ్‌గౌడ్,రైతు సమన్వయ కమిటి చైర్మన్ భూపతిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments