Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

talk

మనతెలంగాణ/భూపాలపల్లి ప్రతినిథి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవుల సంరక్ష ణ, పరిరక్షణ కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇం టర్, డిగ్రీ, ఐటిఐ కళాశాలల ప్రిన్సిపాల్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణం, అడవుల ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే అడవులు నశించడానికి కారణమవుతున్నాయన్నారు. అం దుకే ప్రతిఒక్కరూ అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి సామజిక బాధ్యతతో మెలగాలని పేర్కొన్నారు. చిన్నారులకు,యువతలకు విద్యార్థి దశనుంచే పర్యవరణంపై అవగాహణ, పరిసరాలతో సంబందం పెంచడం ద్వారా కాపాడే వీలుందని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ప్రయివేట్ కళాశాలలో విద్యార్థులచే కాలేజీల వారిగా ఎకో క్లబ్‌లను ఏర్పా టు చేయాలని సూచించారు. అటవి శాఖ జనవరి మొదటి రెండు వారాల్లో కళాశాలలో విద్యార్థులచే సమావేశాలు నిర్వహించి ఏకో క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు జిల్లాలోని పాండవుల గుట్టపై రాక్‌క్లబింగ్,అడవుల సందర్శన,సైక్లింగ్ మార్తన్ లాంటి ప్రకృతి సనిత్యం ఏర్పడే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎప్‌ఓ రవికిరణ్ మాట్లాడుతూ ఇప్పటికే వరంగల్ ,హైద్రాబాద్‌నుండి వస్తుంన్న హౌత్సహికులచే పాండవుల గుట్టల్లో రాక్‌క్లబింగ్ లక్నవరంలో స్లైకిం గ్ అడవి సందర్శన క్యాంపు ఫైరింగ్ బర్డ్‌వాచింగ్ ఎండ్ల బండ్లలలో అటవి ప్రాంతాల్లో ప్రయాణం బహుత సందర్శన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అడవుల సంరక్షణకు విద్యార్థులు యువత భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ ప్రవేట్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు తదితరులు పాల్గొన్నారు.
రేగొండలో కలెక్టర్ ఆకస్మీక పర్యటన
మనతెలంగాణ/రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో జిల్లా కలెక్టర్ మురళి గురువారం ఆకస్మీకంగా పర్యటించారు. ఈసందర్భంగా కలెక్టర్ మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రికార్డు రిజిస్టర్లను పరిశీలించి తహసీల్దార్ మల్లయ్యను భూరికార్డుల వివరాలను, కొత్తపెల్లి గోరి రైతుల పట్టాల భూములకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోనరావుపేట, సుల్తాన్‌పూర్ జంమ్‌షెడ్ బేగేంపేట్ గ్రామానికి సంబంధించిన గోరిసహెబ్ భూముల పట్టాల విషయంపై తహసీల్దార్‌తో మాట్లాడారు. అనంతరం రేగొండలో స్మశాన వాటిక, పొనగల్లులో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణపనులు, స్థలాన్ని పరిశీలించి నాణ్యతతో నిర్మించి త్వరగతిన పనులు పూర్తిచేయాలని కాంట్రక్టర్లను ఆదేశించారు. రేగొండ, పొనగల్లు గ్రామల సర్పంచ్‌లు మోడెం ఆదిలక్ష్మీఉమేష్‌గౌడ్, సాంబయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments