Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

ph

జడ్చర్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం ఎస్వీఎస్ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పరామర్శించారు. బుధవారం రాజాపూర్ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జడ్చర్లకు చెందిన లోటస్‌స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గురువారం ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎర్రశేఖర్ వెంట కరాటేశ్రీను, పార్శివెంకటేశ్, పర్శవేది, మురళి, తదితరులు ఉన్నారు.

Comments

comments