Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

వికలాంగుల కుటుంబాలకు ఉచిత నల్లా కనెక్షన్‌లు

knr

ప్రారంభించిన ఎంఎల్‌ఎ గంగుల,
మేయర్ రవీందర్ సింగ్
కరీంనగర్‌టౌన్:నగరంలోని వికలాంగుల కాలనీలోని కుటుంబాలకు ఉచిత నల్ల్లా కనెక్షన్‌లు బుధవా రం అందించారు. నగరపాలక సంస్థ మేయర్ ఆధ్వర్యంలో ఉచిత నల్లాకన్షెక్షన్‌ను అందించగా ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఇంటింటికి నల్ల కనెక్షన్ అందించడమే ప్రభుత్వం ధ్యేయం అన్నారు. వికలాంగుల కాలనీలో ఉచి తంగా నల్లాలను ప్రారంభించడం ఎంతో సంతోషదాయ కమన్నారు.రాష్ట్రంలోని వికలాంగుల కుటుంబాలకు ఉచిత నల్లా కనెక్షన్ ఇప్పించేందుకు మంత్రి కెటీఆర్‌ను కోరడం జ రుగుతుందన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల కుటుంబానికి నల్లా ఉండాలనే సంకల్పంతో బల్దియా వి నూత్న కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
అందులోని భాగంగానే 136 వికలాంగుల కుటుం బాలకు నల్లా కనెక్షన్‌లను ఉచితంగా అందించడం జరిగిం దన్నారు.అనంతరం నల్లా పాస్ బుక్ లను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, కార్పోరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి, సునీల్‌రావు, ఎడ్ల సరిత-అ శోక్, హరీఫ్, చల్ల హరిశంకర్, మున్సిపల్ సిబ్బంది పా ల్గొన్నారు.
హౌజింగ్ బోర్డు సమస్యలపై సమావేశం
నగరంలోని 21వ డివిజన్ హౌజింగ్ బోర్డు కాలనీలో కా ర్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆధ్వర్యంలో సమస్యలపై సమావే శాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నగర మేయర్ స ర్ధార్ రవీందర్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ మంచి నీటి సమస్యను పరిష్కారిస్తామన్నారు. డివిజన్ వాసులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కారిస్తామన్నారు. త్వరలోనే తాగు నీటి పైప్ లైన్‌లను వేస్తామన్నారు.గతంలో నల్ల్లా ఉండి రిప్లేస్‌మెంట్ ఇవ్వడం కొరకు 500 చెల్లించి తీసుకో వాలన్నారు. ప్రతి ఒక్కరూ నూతన కనెక్షన్ తీసుకోవాల న్నారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రజలు, తదితరులు పా ల్గొన్నారు.

Comments

comments