Search
Saturday 21 April 2018
  • :
  • :

ఫ్రెండ్లీ పోలీసింగే మా కర్తవ్యం

friedly-police

* శాంతి భద్రతలను
సమర్థవంతంగా కాపాడాం
* ఈ ఏడాది గణనీయంగా
తగ్గిన క్రైం రేటు
8 చట్టాన్ని అతిక్రమిస్తే
చర్యలు తప్పవు: జిల్లా ఎస్‌పి
డాక్టర్ బి.అనురాధ

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: ఫ్రెండ్లీ పోలీసింగే మా ప్రధాన ధ్యే యమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే నేరాలను అదుపు చేస్తామని, పోలీసు సిబ్బంది ప్రవర్తనపై, వ్యవహారశైలిపై ప్రత్యేకంగా శిక్షణను ఇస్తున్నామని జిల్లా ఎస్‌పి డాక్టర్ బి.అనురాధ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వార్షిక నివేదికను విడుదల చేశారు. 2016 సంవత్సరానికి సంబంధించిన కేసు ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లో శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడుతున్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది ప్రవర్తనపై ప్రత్యే కంగా దృష్టి సారించామని అందుకుగాను జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఒక వి భాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతేడా దితో పోల్చితే ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని, కేసులు తక్కువగా నమోద య్యాయని, నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించామని తెలిపా రు. ఈ ఏడాది జిల్లాలో జరిగిన కురుమూర్తి, మన్యంకొండ, చెన్నకేశవ స్వామి జాతర, బాలాజీ జాతరలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట భద్రతను చేపట్టామని తెలిపారు. 2016లో జడ్చర్ల కేసును, ఆయుధాల కేసును, ఎటిఎం చోరీ కేసులను తక్కువ సమయం లో చేధించామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంతో పోలీసుల కు ప్రతి ఒక్కరు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలుగ కుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కమాండ్ కం ట్రోల్ రూం, ఫీడ్ బ్యాక్ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపా రు. 500 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. షీటీమ్స్ సమ ర్థవంతంగా పనిచేస్తున్నాయని, రానున్న రోజుల్లో వాటిని మరింత పెం చుతామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశామ ని, తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2015లో 23.18 శాతం క్రైం రేటు నమోదు కాగా, 2016లో 22.14 శాతం నమోదైందని, ఈ ఏడాది 14.25 శాతం క్రైం రేటు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో గతేడాదితో పోల్చితే క్రైం తగ్గిందని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా జిల్లా పోలీసులు సమర్థ వంతంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈఏడాదికి కేసులకు సంబంధించిన నివేదికను విడుదల చేశారు. నివేదిక ప్రకారం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. 2015లో 5338, 2016లో 5162 కేసులు నమోదు కాగా, 2017లో 4442 కేసుల నమోదైనట్లు పేర్కొ న్నారు. 2017లో దొంగతనాల కేసులో రూ.1,75,95,020 చోరీకి గురికాగా రూ.50,26,720 రికవరీ చేసినట్లు తెలిపారు. 2017లో 115 గ్రేవ్‌కేసులు, 1758 నాన్ గ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 2016లో 4442 కేసుల్లో 2887 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
మద్యం తాగి వాహనం నడిపితే కఠన చర్యలు
నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూ చించారు. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్పెషల్ టీంతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తామని, భద్రతను పెంచు తున్నామని తెలిపారు. జిల్లాలోని పలు చోట్ల తనిఖీల కోసం టీంలను ఏర్పాటు చేశామని, జాతీయ రహదారిపై నాలుగు పెట్రోల్ వాహనాల ను ఏర్పాటు చేశామని తెలిపారు. వేడుకలను సంతోషంగా జరుపుకోవా లని, విషాదాంతంగా మార్చుకోవద్దని తెలిపారు. నిబంధలను అతిక్ర మించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. వైన్స్, బార్ షాపులు రాత్రి 10 తర్వాత ఓపెన్ చేసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.
సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్‌పి డాక్టర్ బి.అను రాధ పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షాలు తెలుపుతూ ప్రత్యేకంగా రూ పొందించిన గ్రీటింగ్ కార్డులను సిబ్బందికి ప్రతి ఒక్కరికి పంపించ నున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందికి స్థానిక ఎస్‌ఐ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షల గ్రీటింగ్‌కార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎఎస్‌పి శ్రీనివాసరావు, డిఎస్‌పి భాస్కర్ పాల్గొన్నారు.

Comments

comments