Search
Monday 11 December 2017
  • :
  • :

చల్లని నెలలో ఓ.. నిండు చందమామ

                  Moon

న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి ఆకాశంలో నిండు చంద్రుడు కాంతులు వెదజల్లాడు. సాధారణంగా చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చి సంపూర్ణ కాంతివంతంగా ఉండే దశను సూపర్‌మూన్‌గా పిలుస్తారు. వాయు కాలుష్యం, నగరాలు, పట్టణాల విపరీత విద్యుద్దీకరణతో అత్యధికులు ఈ నిండు చంద్రుడిని వీక్షించలేని స్థితి ఏర్పడింది. అయితే కన్పించిన వారికి ఈ నిండు చంద్రుడు ఆహ్లాదపు పండుగను మిగిల్చాడు . సూపర్‌మూన్ పరిణామంలో సాధారణంగా కన్పించే చంద్రుడి కన్నా 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది. డిసెంబర్ పూర్తి స్థాయి చంద్రుడిని చల్లని చంద్రుడిగా పిలుస్తారు. 2౦17లో కన్పించిన తొలి సూపర్ మూన్ ఆదివారం నాటి చంద్రుడే. సూపర్‌మూన్‌ను ఆసరాగా చేసుకుని శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలు విస్తృతం చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ విశ్లేషణల ప్రకారం మూడు సూపర్‌మూన్‌ల వరుసలో ఆదివారం పరిణామం తొలిది.

తరువాతి రెండు నిండు చంద్రులు వచ్చే ఏడాది జనవరిలోనే ఉంటాయి. జనవరి 1న ఒకటి, జనవరి 31న మరొకటి భూమికి దగ్గరికి వస్తాయి. 1948 తరువాత 2౦16లో తొలిసారిగా చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చాడు. అప్పటి చంద్రుడు, ఆ తరువాత ఈ ఆదివారం చంద్రుడి తరువాత భూమికి అతి దగ్గరగా వచ్చి వెన్నెలల వరదను కల్గించడం 2౦34 నవంబర్ 25న కానీ సంభవించదు. భారతదేశంలో పలు చోట్ల నిండు చంద్రుడు కన్పించినా దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని ప్రాంతాలలో ఆకాశంలో ఎక్కడా ఈ నిండు చంద్రుడి జాడ తెలియకుండా పోయింది. చంద్రుడు మబ్బుల మాటున కాకుండా కాలుష్యపు పొరల వెనక కొట్టుమిట్టాడంతో చంద్రుడు చివుక్కుమనడం ఒకటయితే మనిషి ఉలికిపడటం కీలకం అయింది.

Comments

comments