Search
Tuesday 19 June 2018
  • :
  • :

టిమాస్ సదస్సుకు గద్దర్ రాక

talk

మన తెలంగాణ/అమరచింత: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న మండల కేంద్రంలోని జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో జరిగే టిమాస్ సదస్సుకు ప్రజా యుద్దనౌక గద్దర్, టిమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌విస్లీ ముఖ్యఅతిథులుగా పాల్గొంటా రని, ప్రజాసంఘాల నాయకులు జిఎస్ గోపి, వెంకటేష్‌లు తెలిపారు. ఆదివారం జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో టిమాస్ సభను పురస్కరించుకొని ప్రజా సం ఘాల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోటి ఆశలతో ఏర్పడిన తెలం గాణలో దొరలు రాజ్యమేలు తున్నారని దొరల పాలనలో సామాన్యులకు కష్టాలు ఎక్కువయ్యాయని వారు ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, నీళ్లు, నిధు లు పలు అంశాల్లో నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయన్నారు.93 శాతం ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తు న్నారని, సామాజిక తెలంగాణ కోసం ఏర్పడిందే టిమాస్ ఫోరం అని వారు తెలిపా రు. ఈ నెల 20న జరిగే టిమాస్ సదస్సుకు సామాజిక కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు. ప్రజా సంఘాల నాయకులు ,కార్యకర్తలు పాల్గొనాలని వారు పిలు పునిచ్చారు. కార్యక్రమంలో ప్రభాకర్, రవి, అరుణ్‌కుమార్, నాగరాజు, సురేష్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments