Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కొనుగోళ్లతో మార్కెట్ కు జోష్

bsns1

 35 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ సమీక్షలో ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో క్రితం రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 352 పాయింట్లు లాభపడి 32,949 పాయింట్ల వద్ద ముగిసింది. కొనుగోళ్ల సానుకూలతతో పాటు ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూర్చింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 33వేల మైలురాయికి చేరువ కాగా, మరోవైపు నిఫ్టీ 120 పాయింట్లు లాభపడింది. బుధవారం ఆర్‌బీఐ సమీక్ష అనంతరం సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయింది.. అయితే గురువారం ఉదయం నుంచి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దిగువకు పడిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు పైపైకి ఎగశాయి. నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 10,167 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిప్టీలో గెయిల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక్కో షేరు ధర 8 శాతానికి పైగా పెరిగింది. ఇక టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా భారీగా లాభపడింది. ఈ సంస్థ ఒక్కో షేరు విలువ 7శాతం పెరిగింది. టెక్‌మహీంద్రా, యుపిఎల్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ కూడా రాణించాయి. కోల్ ఇండియా, టిసిఎస్, విప్రో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
ఉత్సాహంగా మిడ్, స్మాల్‌క్యాప్
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ జోరందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.3 శాతం ఎగశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1851 లాభపడగా, 828 షేర్లు నష్టపోయాయి. గత రెండు రోజుల్లో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) నగదు విభాగంలో రూ. 1,800 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, బుధవారం మరింత అధికంగా రూ. 1,218 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
భారీగా లాభపడిన గెయిల్, టెక్ మహీంద్రా
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ షేరు నేడు 8.54 శాతం ర్యాలీతో టాప్‌గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యుపిఎల్, ఏసియన్ పేయింట్స్ 4 నుంచి 7 శాతం వరకు లాభపడ్డాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం టెక్‌మహీంద్రా షేరు 5 శాతానికి పైగా ర్యాలీ చేసింది. రూ.471.55ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన టెక్ మహీంద్రా ర్యాలీ కొనసాగిస్తూ 5.76 శాతం లాభపడింది. ఆఖరికి రూ.511.30ల స్థాయికి చేరింది. టెక్ మ హీంద్రా షేరు ఏడాది, కనిష్ట ధరలు వరుసగా రూ. 357.60 లు, రూ.515.30లుగా ఉన్నాయి. మరోవైపు కోల్ ఇండియా, టిసిఎస్, విప్రో, సిప్లా షేర్లు నష్టపోయాయి. గత వరస ట్రేడింగ్ సెషన్స్‌లో భారీగా పతమైన నిఫ్టీ బ్యాంకు సూచీ కూడా ర్యాలీ చేసింది.

Comments

comments