Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

15 ఎకరాల స్థలంలో గార్మెంట్ యూనిట్స్

garments

= 10 వేల మందికి ఉపాధి
= కే వెంచర్స్ సంస్థ ప్రతినిధుల వెల్లడి
మన తెలంగాణ / సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమా రు 15 ఎకరాల స్థలంలో 5000 అధునాతన జుకీ మిషన్లతో తమ అపెరల్ యూనిట్‌ను స్థాపించి 10000 మందికి ఉపా ధి కల్పించడానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కే వెంచర్స్ ప్రై. లి. ముఖ్య కార్య నిర్వాహణాధికారి యస్ సుసిందరన్, ఉపాధ్యక్షులు సంపత్ కాళీరాజన్‌లు సంసిద్ధత వ్యక్తం చేశారు. బుధవారం సిరిసిల్లలో వారు పర్యటించిన సందర్భం గా పట్టణంలోని గార్మెంట్ యూనిట్లను, ప్రతిపాదిత అపెరల్ పార్కు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కే వెంచర్స్ సంస్థ తరపున సిరిసిల్లలో అపెరల్ పార్కును నెలకొల్పి తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. యూనిట్‌లో స్థానిక మహిళలకు ప్రత్యేక శిక్షణనిచ్చి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. యూనిట్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జుకీ, వాల్ మార్ట్ కంపెనీలకు చెందిన వాటితో పాటు నిట్టేడ్ గార్మెంట్స్ తయారు చేయించడానికి నిర్ణయించారు. యూనిట్ ఏర్పాటయితే టెక్స్‌టైల్ పార్కులో వస్త్ర ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. మెగా అపెరల్ యూనిట్ స్థాపించబడి వేలాది మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడి వి అశోక్‌రావు, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు. జనవరి 10, 2018 లోగా సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్టు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

Comments

comments