Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

సినిమా థియేటర్‌లో బాలికపై గ్యాంగ్ రేప్

Minor Girl Pregnant by Young Man In Ranga reddy

లక్నో: యుపిలోని మీరట్ జిల్లాలో దారుణం జరిగింది. పదహారేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. మూవీకి తీసుకెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముజాఫర్‌నగర్‌కు చెందిన బాలికకు ఫోన్ ద్వారా రెండు నెలల క్రితం ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఇరువురూ చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అయితే ఫోన్ పరిచయాన్ని ఆసరగా చేసుకున్న యువకుడు షాపింగ్‌కు వెళ్దామని చెప్పి మంగళవారం బాలికను మవన ప్రాంతానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన బాలికను షాపింగ్ అనంతరం మూవీకి వెళ్దామని సినిమా థియేటర్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆ థియేటర్‌లో యువకుడి స్నేహితుడు ఉన్నాడు. అయితే మూవీ ప్రారంభమైన వెంటనే ఆ ఇద్దరు యువకులు కలిసి బాలికను బలవంతంగా థియేటర్‌లోని బాల్కానీలోకి లాక్కేళ్లారు. అక్కడ బాలికపై ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బైక్‌పై తీసుకెళ్లి ముజాఫర్ నగర్‌లో దించేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను కూడా సీజ్ చేశారు.

Girl gangraped inside movie theatre in UP.

Comments

comments