Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

బాలిక కిడ్నాప్

RESHMA1

జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండలం గొరికోతపల్లి గ్రామంలో రేష్మా (7) అనే బాలిక ఆదివారం రాత్రి కిడ్నాప్ అయింది. ఈర్లా రాజు, ప్రవల్లికల కూతురైన రేష్మా ఆదివారం రాత్రి గ్రామంలో జరిగిన డిజె సౌండ్స్ ప్రోగ్రాంకు వెళ్లింది. రేష్మా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా గాలించారు. కానీ ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రేష్మా పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రేష్మా ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Girl Kidnapped in Gorikotapally

Comments

comments