Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

వీళ్లు స్టూడెంట్స్ కాదు.. స్టుపిడ్స్!!

Girl-molested-by-group-of-m

భువనేశ్వర్: ఒడిశాలోని బర్గడ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వీధి రౌడీలా ప్రవర్తించారు. కాలేజీ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తున్న తోటి విద్యార్థినిపై ఆరుగురు విద్యార్థులు పట్టపగలు అందరూ చూస్తుండగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిసెంబర్ 3న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై లైంగిక వేధింపులు, ఐటి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఒడిశా డిజిపి రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు.

Girl molested by group of men in broad daylight.

Comments

comments