Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

బాలిక హత్య

                      MURDER

మెదక్: ఓ వ్యక్తి బిస్కెట్ లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో జరిగింది. అదే గ్రామంలో బిహార్ రాష్ట్రానికి చెందని హాసినా-కలాంల పెద్ద కూతురు ఖుష్బూ(6) కనిపించడంలేదని పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేశారు.  పోలీసులు విచారణ చేస్తుండగా గ్రామ శివారులో కల్వర్టు వద్ద బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక శరీరంపై బట్టలు లేకపోవడంతో లైంగిక దాడి జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక కుటుంబంతో సన్నిహితంగా ఉండే  శమీర్ కుమార్ పాఠశాల నుంచి బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. శమీర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Comments

comments