Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

మనుస్మృతి ఆధారంగా పాలన

cpiమన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : దేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అందిరికి సమాన అవకాశాలు, హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని అమలు చే యాల్సిన దేశ బిజెపి పాలకులు వాటిని విస్మరిస్తూ “భారత రాజ్యాంగానికి గొడ్డలిపెట్టుగా మారిన మను స్ముతి”పై ఆధారపడి పాలన కొనసాగిస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యలు విమర్శించారు. యాదాద్రి భువన గిరి జిల్లా పరిధి రాయగిరి గ్రామంలో అట్టహాసంగా జరుగుతున్న సిపిఎం జిల్లా ప్రథమ సభల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమయిన ప్రతి నిధుల మహాసభలో మాజీ ఎమ్మెల్సీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అనం తరం జరిగిన ప్రారంభ సభలో పుణ్యవతి మాట్లాడు తూ దేశం లో బిజెపి పాలకులు అధికారంలోకి వచ్చాక ఒక వైపు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బిసి, వెనుకబడి న కులాల మహిళలు అనేక దాడులను ఎదుర్కొంటున్నా రని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సంపన్న వర్గాలకు, కార్పొరేటర్లకు లక్షలకోట్ల రాయితీలు కల్పిస్తూ పేదలను దోచి సంపన్న వర్గాలకు అప్పన్నంగా అప్ప జెప్పు తున్నారని ప్రభుత్వాలపై ఆమె ధ్వజమెత్తారు. 2014లో మోడీ అధికారాన్ని చేపట్టాక మతం పేరుతో బిజెపి బలాన్ని పెంచుకునేందుకు తీవ్రమైన ప్రయ త్నాలు చేస్తున్నారని అదేపేరుతో వివిధ వర్గాల ప్రజలపై దాడులు పూనుకోవడం బాధాకరంగా ఆమె అభివర్ణిం చారు. సిపిఎం కార్యదర్శివర్గస భ్యులు జూలకంటి రంగారెడ్డి మట్లాడుతూ ఎంతో ఆశతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడి, రాష్ట్రం అభివృద్ది చెందడం అంటే కేసిఆర్ కుటుం బం, కేసిఆర్ భజన పరులు అభివృద్దిచెందడం కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న సబ్బండవర్గాల ప్రజలు అభివృద్ధి చెంది తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మహాసభకు కొండమడుగు నర్సింహ్మ, భట్టుపల్లి అనురాధ, కల్లూరి మల్లేశం అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతలభూపాల్‌రెడ్డి, మంగ నర్సింహ్మ, మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి, చింతల కిష్టయ్య, జిల్లా నాయకులు వేముల మహేందర్, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయక్రిష్ణ, జి ల్లా నాయకులు సిర్పంగి స్వామి, ఎ.వెంకటేశం, ద య్యా ల నర్సింహ్మ, అంజయ్య, వెంకటేశం పాల్గొన్నారు.

Comments

comments