Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

చుక్కలు చూపిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులు

Aarogya-sri

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందా? పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్షంతో ప్రారంభించిన పథకం నీరు గారుతోందా? అంటే అవుననిపిస్తుంది. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్ద్ధేశంతో ఈ పథకాన్ని 2005లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. మొదట్లో ఈ పథకం సక్రమంగా సాగినా అనంతరం నీరుగారిపోయింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం ఈ ప థకం మరింత బలహీన పడింది. ఇందుకు తీడుగా కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ కార్డు దారులను పట్టించుకోవడంలదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్నచూపే…
ఆరోగ్య శ్రీ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్న రోగులకు అక్కడి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. రోగులకు ప్రాణ భయం పెట్టి డబ్బులు కట్టించుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. డబ్బులు కట్టలేని వారిపై చిన్న చూపు చూస్తున్నారు. అమ్మో ఆరోగ్యశ్రీ నా రేపు మాపు రం డి అంటూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదేంటని పలువురు రోగుల బంధువులు ఆసుపత్రి వర్గాన్ని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ డబ్బులు తమకు సమయానికి రావడం లేదని ఆసుపత్రి వర్గాలు జవాబునిస్తున్నాయి.
అందని కార్పొరేట్ వైద్యం….
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు వైద్యసేవలు ఎలా అందుతున్నాయో ఎవరు పర్యవేక్షించడంలేరు. ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే రోగాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆసునపత్రులకు వెళితే అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం ఈ ఒక్కదానికి ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చి చెబుతున్నారు. చివరకు డబ్బలు కట్టించుకుని అదే రోగానికి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇదే విషయంపై రోగి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తా నికి ప్రజలకు మాత్రం కార్పొరేట్ వైద్యం దూరమైందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఆరోగ్యశ్రీ ఉంటే ఆలస్యమే….
కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులు వెళితే అక్కడ వెళ్లినప్పటి నుంచి అంతా సపరేటే, ఆరోగ్యశ్రీ రోగులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. నగదు చెల్లించే వారికి మాత్రమే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు వైద్య సేవలు కూడా ఆలస్యంగానే అందుతున్నాయి. ఇంతే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు, ఇతర ఏదైనా వ్యాధులతో ఆసుపత్రుల్లో అడ్మిట్ కావాలంటే సుమారుగా 4నుంచి6 రోజుల సమయం పడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తిరిగి ఇంటికి వెళ్లలేక ఆసుపత్రుల ఆవరణలో అడ్మిషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
కేంద్రం కితాబు….
తెలంగాణలో గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం బిల్లులకోసం ఆరోగ్య శ్రీ సేవలను కొన్ని సందర్భాల్లో నిలిపి వేశాయి. దీంతో అత్యవసర సేవలు కూడా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు కేంద్రం కితాబునిచ్చి నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఎన్‌హెచ్‌పీఎస్) కింద ఆరో గ్యశ్రీ సేవలను మరింత విస్తృ తం చేసేందుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందక పోయినా కేంద్రం కితాబు ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Comments

comments