Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

కామంతో జీవితాలు ఛిద్రం … చిన్నారులు భద్రం

child

కామాంధుల కాటుకు బలవుతున్న చిన్నారులు,యువతులు
జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలతో మహిళా లోకం కలవరం
దాడులు అరికట్టాలని గళమెత్తిన యువతులు
బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

కమలాపూర్: కామాంధుల కాటుకు చిన్నారులు, యువతులు బలవుతూ నే ఉన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు మానవజాతి సిగ్గుపడేలా పశువుల్లా ప్రవర్తిస్తూ చిన్నారులు, యువతులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. జిల్లాలో ఇటీవ ల జరిగిన రెండు సంఘటనలతో మహిళలను దాడులు నిత్యం కలవరపెడుతూనే ఉన్నా, యువతిపై యాసిడ్‌దా డి సంఘటన మరువకముందే మూడురోజుల వ్యవధిలో నే ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారంచేసి హతమార్చిన సం ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. వరుస ఘటనలతో మహిళలు గళమెత్తారు. దాడులకు పాల్పడ్డ వారిని శిక్షించాలంటూ నిరసన కార్యక్రమాలకు పూనుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో జరిగిన సంఘటనలు సమాజంలో మాయనిమచ్చగా నిలుస్తున్నాయి. నిర్భయ చట్టాలు వంటి పెద్ద చట్టా లు అమల్లో ఉన్నా కా మాంధుల కళ్ళకు అవి చిన్నవైపోతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు, పోలీస్ లు మహిళలపై దాడులకు, వేధింపులకు పాల్పడ్డవారిపై కఠినచర్యలకు పూనుకుంటున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు, వేధింపులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలంటూ మరోవైపు మహిళా సంఘాలు, యువతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కామంధుల్లో మార్పు రావడంలే దు. అలాంటి సంఘటనలే వరంగల్ అర్బన్ జిల్లా లో వరుసగా చోటు చేసుకోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేస్తున్నారు. ఈ నెల 29న ఐనవో లు మండలంలోని గరిమిల్లపల్లి సమీపంలో బోయి ని మాధురి (30) అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన నుంచి తేరుకోక ముందు ముక్కు పచ్చలారని బాలికపై కామంధులు అత్యాచారంకు పాల్పడ్డ ఘోర సంఘటన చోటు చేసుకోవడం గుండెలు పిండేలా చేసింది.
పుట్టినరోజున తోటి స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆడుకోవాల్సిన ఏడేళ్ళ చిన్నారిని కా మంధులు పొట్టనబెట్టుకున్నారు. గడ్డివాములో శవమై కనిపించిన చిన్నారిని చూసిన తల్లిదండ్రు లు రోదించిన సంఘటన సభ్య సమాజాన్నీ ఆలోచించేలా చేయగా పుట్టిన రోజే నూరేళ్ళు నిం డాయి. సమాజంలో ఎక్కడో ఏ మూలనో కామాంధులు, పోకిరీలు కోరల చాచుకొని ఉంటున్నారు.

Comments

comments