Search
Sunday 27 May 2018
  • :
  • :

ప్రేమ పేరుతో వంచన : డాక్టర్ ఆత్మహత్య

GEETA

హైదరాబాద్ : చైతన్యపురిలో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో గీతాకృష్ణ తానుండే హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గీత ఆత్మహత్య చేసుకునేముందు తన సోదరితో ఫోన్‌లో మాట్లాడింది. నరేష్ అనే వ్యక్తి గీతను కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గీతతో పెళ్లికి నరేష్ నిరాకరించాడని, దీంతో మనస్తాపానికి గురైన గీత ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు చెబుతున్నారు. గీతాకృష్ణ స్వస్థలం జగిత్యాల. పోస్టుమార్టం కోసం గీతాకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Impersonation of Love: Doctor Suicide

Comments

comments