Search
Monday 11 December 2017
  • :
  • :

వికలాంగులకు ప్రోత్సాహకాలు

mike

* జిల్లాలోని ఆరు దివ్యాంగుల సెంటర్లలోని వారికి విహార యాత్రలు
* వికలాంగులను వివాహాం చేసుకున్న 20 మందికి
50వేల చొప్పున ప్రోత్సహాకాలు
* జిల్లాలో 400 గ్రామాలలో భూప్రక్షాళణ పూర్తి కావచ్చింది
* జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్

మన తెలంగాణ/ వికారాబాద్ టౌన్  ః  ఈనెల 6న వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన అధికారులకు సిబ్బందికి ప్రోత్సహాకాలు అందిస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. ఈనెల 10 వరకు దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని  బొమ్రాస్‌పేట, దౌల్తాబాద్, కోడంగల్, కుల్కచర్ల బంట్వారం, బషీరాబాద్ సెంటర్లలోని వికలాంగులకు హైదరాబాద్‌లోని జూపార్కు, గాని ఇతర పర్యాటక ప్రాంతాలకు విహార యాత్రకు పంపిస్తామని అన్నారు. అదే విధంగా ఉపాదిహామీలో ని శ్రమ శక్తి సంఘాలలో వికలాంగులకు లక్షం మేరకు పని కల్పించిన వారిలో కొంత మందిని ఎంపిక  చేసి ఎపిఒ స్థాయి నుండి ఒకరిని, టెక్నికల్ అసిస్టెంట్ ఒకరిని, ఫీల్డు అసిస్టెంట్  ఒకరి చోప్పున ఎంపిక చేసి సత్కరిస్తామని అన్నారు. అదేవివధంగా ఎస్‌ఎల్పీ గ్రూపులలో  ముగ్గురిని సెలక్టు చేసి సత్కరిస్తామని అన్నారు.  అదే విధంగా భాగా పని చేస్తున్న కొంత మంది సిసి లను కూడ ఎంపిక చేసి సత్కరిస్తామని అన్నారు.  దివ్యాంగులను వివాహాం చేసుకున్న 20 మందిని లాటరీ పద్దతిన ఎంపిక చేసి జిల్లా సంక్షేమ శాఖ నుండి 50 వేల చొప్పున ప్రోత్సహాకాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లాలో 12 యూనిట్స్ ఫిజికల్ హాండ్ క్యాప్‌డ్ పిల్లలకు ఎకనామికల్ సపోర్టు చేస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని 501 గ్రామాలలో భూప్రక్షాళన 400 గ్రామాలలో పూర్తి కావచ్చిందని అన్నారు. 100 గ్రామాలలోని సమస్యాత్మకంగా కేసులలో ఉన్నవి గ్రామ స్థాయిలో అధికారుల సమక్షంలో తగాదాలు పరిష్కరించుకోవాలని అన్నారు. కొట్లాడకుండా పరిష్కరించుకోవడం కోసం ఇది మంచి అవకాశం అని అన్నారు. జిల్లాలో 94.7 శాతము రైతుల ఖాత నెంబర్లు, సర్వే నెంబర్లు క్లియర్ గా ఉందని అన్నారు. మిగతావి  సివిల్ కేసులు  పెట్టుకుని ఎప్పటికి తెగక అలాగే ఉండే వాటిని సామరస్య పూర్వకంగా అధికారుల సమక్షంలో పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆర్డిఒ టిటి, ఆర్‌ఐ గాని  సిబ్బంది అందుబాటులో ఉంటారు ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంద్యారాణి, డిఆర్డిఓ జాన్షన్, ఆర్డిఓ విశ్వనాథం ఉన్నారు.

Comments

comments