Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

భారత్‌కు ఆ సత్తా ఉంది రాహుల్ ద్రవిడ్

dravid

ముంబయి: దక్షిణాఫ్రికా సిరీస్‌లో విజయం సాధించే సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందని భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. త్వరలో జరిగే సౌతాఫ్రికా సిరీస్‌లో భారత్ గెలుస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఇప్పుడూ చాలా బలంగా ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేనకు ఎదురే లేదన్నాడు. మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో కూడిన భారత స్పీడ్ బౌలింగ్ లైనప్ ప్రపంచంలోనే అత్యుత్తమైందన్నాడు. వీరిని ఎదుర్కొవడం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు అంత సులువుకాదన్నాడు. మరోవైపు భారత్‌లో కోహ్లి, పుజారా, మురళీ విజయ్, రహానె, ధావన్, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారన్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా వీరికుందన్నాడు. ఈ పరిస్థితుల్లో భారత్‌ను తక్కువ అంచన వేయడం మంచిదికాదన్నాడు. అంతేగాక హార్ధిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారన్నాడు. దీంతో సౌతాఫ్రికాకు సిరీస్‌లో గట్టి పోటీ ఎదురు కావడం తథ్యమన్నాడు. అంతేగాక కెప్టెన్ కోహ్లి భీకర ఫాంలో ఉండడం కూడా భారత్‌కు ఊరటనిచ్చే అంశమన్నాడు. ఈ పరిస్థితుల్లో భారత్ సిరీస్ అవకాశాలను కొట్టి పారేయలేమని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

Comments

comments