Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘ఇండియా ఫస్ట్’ సక్సెస్ : అమెరికా

us

వాషింగ్టన్ :  ఇండియాకు ప్రాధాన్యతను కల్పించే ట్రంప్ దక్షిణ ఆసియా వ్యూహం పురోగతి సజావుగా సాగుతోంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇది అత్యద్భుత ఫలితాలను ఇచ్చిందని అనుకోవడం లేదని వెల్లడించారు.   అమెరికా అధ్యక్షులు ట్రంప్ తమ విదేశాంగ విధానంలో ప్రత్యేకించి దక్షిణాసియాకు సంబంధించి నూతన పంథాను ఎంచుకున్నారు. అమెరికా ఇంతకు ముందటి వైఖరికి భిన్నంగా ఇప్పుడు దక్షిణాసియా అంశాలలో ఇండియాకే ప్రాధాన్యతను కల్పించారు. ఈ కొత్త పాలసీ వంద రోజులలో ఫలితాల దిశలో ఉందని అయితే ఇది మరింత పటిష్టం అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని వైట్‌హౌస్ ప్రతినిధి వివరించారు. ఇప్పటివరకూ అమెరికా విధానం అటు పాకిస్థాన్, ఇటు ఇండియాకు సమ ప్రాధాన్యతతో ఉంటూ వచ్చింది. అయితే ట్రంప్ అందుకు భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా కోరుకుంటున్న శాంతి తద్వారా ప్రగతి స్థాపనకు భారతదేశానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేలా ట్రంప్ విధానం ఉంది. అమెరికా అధ్యక్షులు ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాసియా విధానం ప్రకటించారు. ఇప్పటికీ ఈ విధానం వంద రోజులు అయింది. ఈ విధానంతోనే అతి తక్కువ సమయంలో గొప్ప ఫలితాలను తాము ఆశించలేదని , ఈ వ్యూహం ఫలితం ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేయడానికి మరింత సమయం అవసరం అని భావిస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు. ఈ విధానం మరింత బలోపేతం కావడానికి సమయం తప్పనిసరి. అయితే ఈ వంద రోజులలో పురోగతి సంతృప్తిగానే ఉందని వివరించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నూతన పాలసీలో నిర్ధేశించారు. ఇండియాకు ప్రాధాన్యతను ఇచ్చే నూతన విధానం ఫలితాలు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తెలిసివస్తున్నాయని విశ్లేషించారు.

Comments

comments