Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

గెలుపునకు ఢీసిల్వా అడ్డు!

thums

 

 విజయంపై నీళ్లు చల్లిన లంకేయులు 

  ముగిసిన చివరి టెస్ట్

  టెస్టుల సిరీస్ 1-0తో భారత్ వశం

చివరి రోజు భారత్ గెలవాలంటే ఏడు వికెట్లు పడగొట్టాలి! అదేంతసేపు.. 20-30 ఓవర్లలో లంక ఆలౌటైపోతుందిలే అనుకున్నారంతా! కానీ.. లంకేయులు ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు! ఎంతమంది బౌలర్లను మార్చినా అసాధారణ బ్యాటింగ్‌తో క్రీజ్‌లో నిలిచారు! రోజంతా బౌలింగ్ చేసినా భారత బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు! దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది! మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది.

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు చివరిరోజు భారత్ బౌలర్లు తేలిపోయారు. బుధవారం ఓవర్ నైట్ స్కోరు 31/3తో బ్యాటింగ్ ఆరంభించిన లంక ఏ దశలోనూ బౌలర్లకు తలొగ్గలేదు. ప్రారంభంలోనే మాథ్యూస్ (1) వికెట్‌ను కోల్పోయినా ఎక్కడా ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ చండీమాల్ సహకారంతో ధనంజయ డిసిల్వా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చండీమాల్ (36) 54వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రోషెన్ సిల్వతో కలిసి డిసిల్వా తన జోరు పెంచాడు. డిసిల్వాను అవుట్ చేసేందుకు భారత కెప్టెన్ కొహ్లీ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో టెస్టుల్లో తన మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డిసిల్వా (119; 219 బంతుల్లో 15×4, 1×6) తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డిక్వెల్లా (44)తో కలిసి రోషెన్ చివర్లో వికెట్ పడకుండా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో రోషెన్‌సిల్వ(74) హాఫ్ సెంచరీ సాధించి భారత్ విజయానికి అడ్డుకట్టగా నిలిచారు. కాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ భారత్ కెప్టెన్ కొహ్లీకి దక్కింది.
87 ఓవర్లు.. రెండు వికెట్లు
ఈ టెస్ట్ మ్యాచ్‌లో చివరిరోజు టీమిండియా రోజంతా బౌలింగ్ చేసినా వికెట్లను పడగొట్టడంలో విఫలమైంది. మొత్తం 87 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే తీసింది. జట్టు స్కోరు 35 వద్ద ఏంజెలో మాథ్యూస్ (1)ని జడేజా పెవిలియన్‌కు పంపించాడు. 147 వద్ద చండిమాల్‌ను అశ్విన్ బౌల్ చేశాడు. అంతే.. మిగతాదంతా లంకేయుల పోరాటమే. తొలుత ఆచితూచి ఆడిన ధనంజయ డిసిల్వా అర్ధశతకం ముందు బౌండరీలు బాదడం ప్రారంభించాడు. జడేజా, అశ్విన్ బౌలింగ్‌ను సులభంగా ఆడేశాడు. అతడు మైదానం వీడినా పరిస్థితిని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన అరంగేట్రం కుర్రాడు రోషన్ డిక్వెలా అర్ధశతకంతో వికెట్ పడకుండా భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. అతడికి సీనియర్ డిక్వెలా తోడుగా నిలిచాడు. శ్రీలంక 103 ఓవర్లకు 299/5తో నిలిచింది. ఆట ముగిసేందుకు మరో 7 ఓవర్లు ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఈ మ్యాచ్‌లో బర్త్‌డే బాయ్ జడేజా 3 వికెట్లు తీశాడు.

శెభాష్ డిసిల్వా..
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వా శతకం సాధించాడు. షమీ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి 188 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో సెంచరీ మార్కు చేరుకున్నాడు. ధనంజయ కెరీర్‌లో ఇది మూడో టెస్ట్ శతకం. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాగా, కష్ట సమయంలో జట్టును ఆదుకున్న డిసిల్వాను లంకేయులతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అభినందించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 536/7 డిక్లేర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 373
భారత్ రెండో ఇన్నింగ్స్: 246/5 డిక్లేర్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నె (సి) సాహా (బి) రవీంద్ర జడేజా 13, సదీరా సమరవిక్రమ (సి) రహానె (బి) మహ్మద్ షమి 5, ధనంజయ డిసిల్వా (రిటైర్డ్ హార్ట్) 119, సురంగ లక్మల్ (బి) రవీంద్ర జడేజా 0, మాథ్యూస్ (సి) రహానె (బి) రవీంద్ర జడేజా 1, దినేష్ చండీమాల్ (బి) అశ్విన్ 36, రోషెన్ సిల్వా (నాటౌట్) 74, నిరోషన్ డిక్వెల్లా (నాటౌట్)44, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 103 ఓవర్లలో 299/5.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 132320, మహ్మద్ షమి 156501, రవిచంద్రన్ అశ్విన్ 3531261, రవీంద్ర జడేజా 3813813, మురళీ విజయ్ 1030,- విరాట్ కొహ్లీ 1010.

Comments

comments