మన తెలంగాణ/జహీరాబాద్ : 29న హైద్రాబాద్‌లోని కుకాపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గోల్ల కుర్మలకు సంబంధించిన రెండు భవనాల నిర్మాణానికి భూ మి పూజ చేయనున్న తరుణంలో మంగళవారం పట్టణంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో బిసి సంఘం ఆధ్వర్యంలో పోస్టరు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బిసి నాయకులు మాట్లాడుతూ హైద్రాబాద్‌లో గొల్ల కుర్మలకు సంబంధించి 5 ఎకరాల స్థలంలో 5 కోట్లతో శ్రీ కృష్ణభవనం, మరో 5 ఎకరాల్లో 5 కో ట్లతో కుర్మ వసతి గృహం కొరకు భవనాలను నిర్మాణాలకు ముఖ్యమంత్రి ని ధులు మంజూరు చేశార ని పేర్కొన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి చేతు ల మీదుగా భవనాల ని ర్మాణాల కోసం భూమి పూజ చేయనున్నారన్నా రు. 29న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే భూ మి పూజ కార్యక్రమానికి గొల్ల కుర్మలు, బిసి వర్గాలు పెద్ద సంఖ్యలో సమావేశానికి చేరుకోవాలని, అందులో భాగంగా పోస్టరును విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ ఖన్నా, హుగ్గెల్లి రాములు, బాపు మల్శెట్టి, సాయికుమార్, పి సుధాకర్, జి భాస్కర్, కిష్ట య్య, రమేశ్‌బాబు, పిజి నారాయణ తదితరులు పాల్గొన్నారు.