Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

పురుగుల మందుతాగి యువకుడు ఆత్మహత్య

body
టేకుమట్లః  మండలంలోని సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన జంగిటి రాములు(32) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చిట్యాల సీఐ జి మోహన్ శుక్రవారం మృతుని కుటుంబ సభ్యుల ప్రకారం జంగిటి రాములు గత 9 సంవత్సరాల క్రితం పర్లపెల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహా జరిగింది. రాములుకు మొదటి భార్యకు కుటుంబ కలహాలు రావడంతో ఆమె విడాకులు ఇచ్చిందని, రాములుకు సుబ్బక్కపల్లికి చెందిన మరో అమ్మాయితో గతనెల 29న వివాహాం జరుపగా వారి ఇరువురిని మొదటి రాత్రే కలహాలు మొదలయ్యాయి. అదే గ్రామానికి చెందిన అమ్మాయి కాబట్టి వెంటనే వారి తల్లి దండ్రులకు విషయం చెప్పగా వీరి మద్యలో కలహాలు చేలరేగి అబ్బాయి శారీరక స్థితిసక్రమంగా లేనందున అమ్మాయి అదే రోజు వారి ఇంటికి వెళ్లిపోయింది. అదే రోజు జంగిటి రాములు ఇంటి నుండి పారిపోగా వారి కుటుంబ సభ్యులు  ఆరా తీయాగా వారి యొక్క వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నట్లు మృతుని తండ్రి కొమురయ్య తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు శవపంచానామ జరిపి పోస్టుమార్టంకు తరలించారని సీఐ జి . మోహన్ తెలిపారు.

Comments

comments