Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

అభిమానం తెచ్చిన తంట…

Iranian-Angelina-Jolie-fan

సినిమా స్టార్స్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుంటే వారి ఆనందానికి హద్దలుండవు. కటౌట్లు కట్టడం మొదలుకొని ఇంకా ఎన్నో ఉంటాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ అభిమాన నటీనటులను పొలిన బట్టలేసుకోవడం, వారి హేయిర్ స్టైల్ లాంటివి ఎన్నో చేస్తుంటారు. అయితే మనం ఇక్కడ చెప్పే అభిమాని మాత్రం వీరందరినీ దాటేసి ఏకంగా సర్జరీ.. కాదు..కాదు సర్జీల వరకు వెళ్లిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. తన అభిమాన నటీలా కనిపించేందుకు ఆమె చేయించుకున్న సర్జరీల వల్ల ఆమె ముఖం అందహీనంగా తయారైంది.

IRANIAN-woman

వివరాల్లోకి వెళితే… ఇరాన్‌కి చెందిన సహర్ తబర్ అనే 19 ఏళ్ల యువతికి ఏంజెలీనా జోలి అంటే పిచ్చి అభిమానం. అచ్చం ఏంజెలీనా ముఖంలానే కనిపించాలని తబర్ ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. అన్ని సర్జరీలు చేయించుకునే సరికి చివరకి ఆమె ఫేస్ భయంకరంగా తయారయింది. అభిమానం కాస్తా అందహీనంగా మార్చేసింది.

Iranian-Angelina-Jolie-fan2

ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే సహర్ అభిమానం మత్తులో లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లైంది. అయితే తాను చేసిన పనిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసింది తబర్. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై కామెంట్ల రూపంలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దెయ్యంలా ఉన్నావంటూ కొందరు, మంత్రగత్తెలా కనిపిస్తున్నావంటూ మరికొందరు, అభిమానం హద్దుమీరితే ఫలితం ఇలాగే ఉంటుందంటూ రకరకాల కామెంట్లతో తబర్‌పై విరుచుకుపడుతున్నారు.

Comments

comments