Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

నేనెంతో ఇష్టపడి మనసుపెట్టి చేశా

మురిపించే అందం, చక్కటి అభినయం కలిసి ఉన్న కథానాయిక కారుణ్య చౌదరి. తాజాగా ఈ అందాల తార హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సీత… రాముని కోసం’. తన్మయ్ చిన్నయ ప్రొడక్షన్స్, రోల్ కెమెరా యాక్షన్ బ్యానర్‌లపై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శిల్ప శ్రీరంగం, సరిత గోపిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా కథానాయిక కారుణ్య చౌదరి చెప్పిన విశేషాలు… 

Karunya

అలా హీరోయిన్‌గా ఎంపికయ్యా…
మా స్వస్థలం కాకినాడ. డిగ్రీ పూర్తి చేశాను. సినిమా హీరోయిన్ కావాలనేది నా కల. అందుకే హైదరాబాద్ వచ్చి హీరోయిన్‌గా ప్రయత్నించాను. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మంచి హీరోయిన్ కోసం వెతుకుతుండగా నేను ఆయనను కలిశాను. తన సినిమాలోని సీత క్యారెక్టర్‌కు సరిపోతానని నన్ను హీరోయిన్‌గా ఎంపికచేశారు.
అదృష్టంగా భావిస్తున్నా…
ఈ చిత్రంలో సీతగా టైటిల్ రోల్ చేశాను. బాపు బొమ్మలా ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఈ పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా సీత రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంతో అందరికీ గుర్తుండిపోతాను. నేనెంతో ఇష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా ఇది.
స్పెషల్‌గా డిజైన్ చేశారు…
దర్శకుడు అనిల్ ఈ కథను రెండు సంవత్సరాలు కష్టపడి తయారుచేసుకున్నారు. ఇందులో సీత క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు. అలాగే సినిమాను అనుకున్నదానికంటే అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఈ చిత్రం మంచి బ్రేక్‌నిస్తుంది.
రాముని కోసం ఏం చేసింది?
ఇదొక పూర్తి ఫ్యామిలీ, ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా. నిశబ్దం అంటే ఇష్టం… నీ శబ్ధం అంటే ఇంకా ఇష్టం అనే డైలాగ్‌లో సీత రోల్ తెలుస్తుంది. సీత రాముని కోసం ఏం చేసింది? తన ప్రేమ కోసం ఎంతవరకు ఎదురుచూసింది అనేదే ఈ చిత్రం.
మంచి అనుభూతితో…
ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. లాలి లాలి… పాటను అనిల్ రాశారు. పెద్ద సింగర్స్ ఈ పాటలు పాడారు. పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అనిల్ గోపిరెడ్డి మంచి సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత మంచి అనుభూతితో బయటికొస్తారు. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు దర్శకుడు అనిల్.
అనుభవమున్న హీరోలా…
శరత్‌కు ఇది తొలి చిత్రమైనా మంచి అనుభవమున్న హీరోలా చేశారు. దర్శకుడు అనిల్ చాలా కూల్‌గా తనకు ఏం కావాలో అది అందరి దగ్గరి నుండి రాబట్టుకున్నారు. ఇక శరత్‌కు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. అలాగే ఈ చిత్రంలో బేబి శాన్వి చక్కగా నటించింది.

Comments

comments