Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

తెలుగు మహాసభల కమిటీలు

tlg

భాషా సదస్సులు, మహిళా, బాల సాహిత్య అవధాన చరిత్ర మున్నగు కమిటీలను నియమించిన సాహిత్య అకాడమీ
తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను సజావుగా నిర్వహించేందుకు మరికొన్ని కమిటీల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగా ణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి తెలిపారు. భాషా సదస్సుల కమిటీ, గేయతత్వ కమిటీ, అవధాన కమిటీ, మహిళా సాహిత్య కమిటీ, బాల సాహిత్య కమిటీ, చరిత్ర కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళా సాహిత్య కమిటీలో ఆచార్యులు సూర్యా ధనంజయ్, వేలూరి శ్రీదేవి, కకడిమిళ్ల లావణ్య, త్రివేణి, పోల్కంపల్లి శాంతాదేవి, జూపాక సుభ ద్ర, అనిశెట్టి రజిత, షాజహాన, జ్వలిత, చక్రవర్తు ల లక్ష్మీనర్సమ్మ, బండారు సుజాతాశేఖర్, నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి ఉన్నారు. బాలసాహిత్య కమిటీలో డాక్టర్ పత్తిపాక మో హన్, ఎం.చిత్తరంజన్, ఐతా చంద్రయ్య, వేదాం తం సూరి, వాసాల నర్సయ్య, వేదకుమార్, దాసరి వెంకటరమణ వి.ఆర్.శర్మ ఉన్నారు. ఘంటా చక్రపాణి, డాక్టర్ డి.రాజిరెడ్డి, డాక్టర్ ద్యావనవలలి సత్యనారాయణ, అడపా సత్యనారాయణ, హరగోపాల్, కుర్రా జితేంద్రబాబు, కావురి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్యలతో చరిత్ర కమిటీని ఏర్పాటు చేశారు. భాషా సదస్సుల కమిటీలో ఆచార్య రవి శ్రీహరి, కపిలవాయి లింగమూర్తి, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, అల్లం నారాయణ, వర్థెల్లి మురళి, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ వెల్చాల కొండలరావులకు చోటు కల్పించారు. గేయతత్వ కీర్తలన కమి టీ తిరుమల శ్రీనివాసాచార్య, పి.భాస్కర యోగి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, కందికొండ, చెన్నకేశవరెడ్డి, వడ్డెపల్లి కృష్ణ, వారి జా రాణి, శ్రేష్ట ఉన్నారు. అవధాన కమిటీ లో అష్టకాల నరసింహ రామశర్మ, గౌరీభట్ల మెట్రామ శర్మ, బెజుగాను రామమూర్తి, ముదిగొండ అమరనాథ్ శర్మ, ఆచార్య రావికంటి వసునందన్, మల్గ అంజయ్య, తిగుళ్ల శ్రీహరిశర్మ, ఎం.హరిదాసు, సాగి కమలాకర శర్మ, ముద్దు రాజయ్యలున్నారు.
తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు కార్టూన్లను ప్రదర్శించనున్నట్లు సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, కవి.రచయిత దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగల, సామెతల ఆధారంగా అనుకూలంగా ఉండే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు మృత్యుంజయ్, శంకర్, నర్సిం వ్యవహరిస్తారన్నా రు. కార్టూనిస్టులు తమ కార్టూన్లను ఎ3 సైజులో మాత్రమే వేయాలని సూచించారు. కార్టూన్లను డిసెంబర్ 10వ తేదీ లోపు wtmscartoon@gmail.comకుఈమెయిల్ చేయాలని సూచించారు. వ్యాఖ్య తెలుగు మాత్రమే ఉండాలి. కార్టూన్‌తో పాటు కార్టూనిస్టు ఊరు, జిల్లా పేరు, ఫోన్ నెంబర్ రాసి హామి పత్రం జత చేయాల్సి ఉంటుంది. ప్రదర్శనలో పాలొన్న వారికి సర్టిఫికేట్‌తో పాటు నగదు బహుమతిని కూడా అందజేస్తారు. ప్రదర్శనలో ప్రచురించబడిన కార్టూన్లు పుస్తకరూపంలో అచ్చువేస్తారు.

Comments

comments