Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

బాలయ్య ‘జైసింహా’ ట్రైలర్ వచ్చేసింది…

Jai-Simha

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘జైసింహా’. ఈ చిత్రం ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ లో బాలయ్య పలికిన ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి’, ‘నీకు కుంభకోణం అంటే భయం… నేనంటే రెండు రాష్ట్రాలకూ ప్రాణం’ అనే డైలాగ్స్ తో పాటు ‘ఎవడ్రా వాడు.. ఆ కళ్లలో పవరేంటి.. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు..’ అనే డైలాగ్ బాగుంది. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య ఇంతకుముందు మూవీస్ లా  పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా అర్థమవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలుగా నటించారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. ఇవాళ  ‘జైసింహా’ ఆడియో విడుదల వేడుక విజయవాడలో జరుగనుంది. సినీయర్ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా మూవీ విడుదల కానుంది.

Comments

comments