Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

దృష్టి మరల్చడం కోసమే జలవిజయ యాత్రలు

sitting*కెఎల్‌ఐ మొదలు పెట్టినప్పుడు ఎక్కడున్నావు?
*నాగంపై నోరుపారేసుకోవద్దు
*బిజెపి నాయకులు

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ః నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతనుండి దృష్టి మరల్చడం కోసం జలవిజ యయాత్ర చేశాడని , రాజకీయంగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న నాగం జనార్దన్ రెడ్డిని కనీసం వార్డు మెంబర్‌గాకూడా గెలవలేని టిఆర్‌ఎస్ నేత జక్కా రఘునందన్‌రెడ్డి విమర్షించడం సిగ్గుచేటని నాగర్‌కర్నూల్ సింగి ల్ విండో చైర్మన్ వెంకట్రాములు తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. గురువారం బిజేపినేత నాగం జనార్దన్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో వెంకట్ రాములుతోపాటు బిజెపి నేతలు మాట్లాడారు. కెఎల్‌ఐ రూపకల్పన నాగం చొరవేనన్న విషయం జగమెరిగిన సత్యమని అలాంటి నాగంను కెఎల్‌ఐకి ఏంచేశాడని ప్రశ్నించడం అవివేకం కాక మరేంటని వెంకట్రాములు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి షాడో ఎమ్మె ల్యేగా జక్కా రషునందన్ రెడ్డి చలామణి అవుతున్నారని స్థాయికి మించి మాట్లాడుతున్నాడని అన్నారు. నాగం పై అవసరంగా నోరుపారేసు కుంటే బిజేపి కార్యకర్తలు బుద్ది చెపుతారని కూడా ఆయన హెచ్చరించారు. ఎమ్మె ల్యే మర్రి టిఆర్‌ఎస్ పార్టీ కి రాజీనామా చేసి తమ నేత నాగం పై స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేస్తే నేటి వరకు స్పందించడం లేదని అన్నారు. నియోజకవర్గంలో నేటి వరకు నాగం హయాంలో చేసిన అభివృద్ది పనులే ఉన్నాయని ఎమ్మెల్యే హయాంలో ఎలాంటి అభివృద్ది పను లు జరగలేదన్నారు. నాగం వేయించిన బిటి రోడ్లకు మరమ్మత్తులు చేసే స్దితి లో కూడా టిఆర్‌ఎస్ నేతలు లేరన్నారు. నియోజకవర్గానికి ఇస్తానన్న డబల్ బెడ్‌రూం , ఇంజనీరింగ్ కళాశాల, ఎయిమ్స్ తరహా ఆసుపత్రి అన్న ఎమ్మెల్యే మాటలు ఎమయ్యాయని ప్రశ్నించారు. బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు కాశన్న మాట్లాడుతూ కెఎల్ ఐ ప్రాజెక్టు రూపకల్పనలో నాగం జనార్దన్ రెడ్డి కృషి చాలా ఉందన్న విషయం ప్రజలందరికి తెల్సునన్నారు. యాత్రలు ప్రతిపక్షా లు పనులు పూర్తికావడంలేదని చేయాలని అధికారంలో ఉండి పనులు సక్ర మంగా చేయించాల్సిన ఎమ్మెల్యే చేస్తున్న పాద యాత్ర వెనుక ఉన్న కారణా లు ఏంటన్నది ప్రజలందరికి తెల్సునన్నారు. మూడున్నర సంత్సరాల కాలం లో అభివృద్ది కోసం కోట్ల రూపాయలు తీసుకువచ్చానని చెపుతున్న ఎమ్మెల్యే ఆ కోట్ల రూపాయలు కార్యకర్తల అభివృద్ది కోసమేనని ఎద్దేవా చేశారు. బిజేపి దళిత మోర్చా జిల్లా అద్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ అలిగిన తన కార్య కర్తల కోసమే ఎమ్మెల్యే జలవిజయ యాత్ర చేసాడని , జలవిజయ యాత్ర లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు విందుల పేరిట మద్యం సేవించి మందు సీసాలను కాల్వల వెంట పడవేస్తే రైతులు వాటిని తీసివేస్తున్నారని ఆరోపించారు. జల విజయ యాత్ర రైతుల బాగు కోసం కాదని కార్యకర్తలు పట్టు కోల్పోకుండా ఉండేందుకే అన్నారు. సమావేశంలో బిజేపి పట్టణ అద్యక్షుడు లక్ష్మీ నారాయణ , బిజేవైఎం పట్టణ అద్యక్షుడు దినేష్ , నసీర్ పాల్గొన్నారు.

Comments

comments