మన తెలంగాణ/క్రిష్ణ : మండల పరిధిలోని చేగుంట గ్రామానికి జగద్గురు రంబాపురి వీర సింహాసనాదీపర మహాసంస్థన ఫీఠాధిపతి డాక్టర్ శ్రీశ్రీశ్రీ ప్రసన్న రేణుక వీరసోమేశ్వరశివా చార్య మహాస్వామి మంగళవారం ఉదయం 11 గంటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పార్వతి పరమేశ్వర ఆలయ అధిపతి క్షీరలింగేశ్వరమహాస్వామి నేతృ త్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఎల్ఎ చిట్టెం రామ్మోహన్రెడ్డి సతీమణి సుచ రిత చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జగద్గురు 62వ జన్మదినం సందర్భంగా 62 మంది దంపతులకు గురురక్ష పీఠాధిపతిగా 25 ఏళ్లు పూర్తయి న సందర్భంగా 25 మంది పురోహితులకు గౌరవ గురురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువుల శాంతమల్లశివచార్య మహాస్వామి, పంచమిద్ధలింగస్వామి నేరడ్గోం, వేదమూర్తి సుగురయ్య గురుజాల, చన్న వీరశివాచార్యస్వామి, గురుమూర్తి శివాచార్యస్వామి కడే చూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, వైస్ చైర్మన్ శివప్ప, బిజెపి రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య, జడ్పిటిసి సరిత మధు సూదన్రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రాజుల అశిరెడ్డి, ఎంపిపి అంజనమ్మ, మాజీ ఎంపిపి లింప్ప, టిడిపి మండలాధ్యక్షుడు శివపాటిల్, సర్పంచ్ సూగమ్మ, ఎంపిటిసి బస్వ రాజప్పగౌడ తదితరులు పాల్గొన్నారు.