Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అందుకే పంచాయతీరాజ్ చట్ట సవరణలు

Jupally-Krishna-Rao

యాదాద్రి భువనగిరి : పారదర్శకత కోసమే పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త చట్టంతో నీతివంతమైన పాలన అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. గడువులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ఘోర ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు స్థానం ఇవ్వకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Jupally Comments on Panchayati Raj Elections

Comments

comments