Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అర్హులకు న్యాయం చేయండి

showమన తెలంగాణ/ఆదిలాబాద్‌టౌన్ : అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం రెవెన్యూ అధికారులు మావల గ్రామ పంచాయతీ పరరిధిలోని గుడిసెలను తొలగించడంతో ఆ స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఇంటి స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిన స్థలంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోయామని, ఇప్పుడు కట్టుకొనేందుకు ముందుకు వస్తుండగా వాటిని కూల్చి వేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలైన అర్హులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

comments