Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

‘కొడకా.. కోటేశ్వరరావు’ సాంగ్ టీజర్…

Pawan-Kalyan

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు అందించిన అజ్ఞాతవాసి పాటలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలు ఉండగా, ప్రస్తుతం ఐదు పాటలను మాత్రమే విడుద చేసింది చిత్ర యూనిట్. ‘కొడకా.. కోటేశ్వరరావు’ అంటూ సాగే ఆరో పాట ఈ నెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ పాటను స్వయంగా పవన్ పాడటం విశేషం. బుధవారం ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇక మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Comments

comments