ముంబయి: ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు విరాట్ కొహ్లీ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నా డు. ఇటీవల తానూ మనిషినేనని, రోబోను కాదని, విశ్రాంతి అవసరమని కోహ్లీ చెప్పడంతో శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్ ఇచ్చింది బిసిసిఐ. అయితే, ఈ విరామ సమయంలోనే విరాట్ కోహ్లీ తన ప్రేయసి, హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటలీలోని మిలాన్‌లో వచ్చే వారంలో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. దీంతో గురువారమే కొహ్లీ ఇటలీకి బయల్దేరేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విరాట్ స్నేహితులు, కుటుంబం మిలాన్‌లో వివాహ వేదికను బుక్ చేసినట్టు చెబుతున్నారు. రిసెప్షన్ మాత్రం డిసెంబరు 21న ముంబై లో ఏర్పాటు చేస్తున్నారని, ఆ వేడుకకు క్రికెటర్లు, సన్ని తులు సహా ప్రముఖులకు ఆహ్వానం పంపుతారని చెబుతున్నారు. మరోవైపు అనుష్క శర్మ పెళ్లి దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారని సమాచారం.