Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఉద్యమానికి కొమురయ్య సూర్తి

harish3* విస్నూర్ దొరను గడ గడలాడించిన దొడ్డి కొమురయ్య
*ప్రజా సమస్యలు పట్టించుకోని గత పాలకులు
*పేద ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్షం
*భారీనీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు

మన తెలంగాణ/ లింగాలఘణపురం : తెలం గాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్షమని భారీ నీటి పారుదలశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో శాసన సభ్యులు తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ విఫ్ బొడకుంటి వెంకటేశ్వర్లతో కలిసి దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ తాటికొండ రాజ య్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ సాయుధ పోరాటంలో విస్నూర్ దొరకు వ్యతిరేఖంగా పోరాడిన అమరుడని గుర్తుచేశారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒకరూ ముందుకు సాగాలన్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోకుండా కుర్చీలో కూర్చొని పదవుల కోసం పాకులాడారని ఎద్దే వ చేశారు. చంద్రబాబు నాయుడు కంప్యూటర్ అభివృద్ధ్దిని, వైఎస్‌ఆర్ రియలెస్టేట్ అభివృద్ధిగా భావించారని, కాని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే అభివృద్ధిగా తీసుకుని అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. వివి ధ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలల్లో కురుమ, యాదవులు ముఖ్య మంత్రులుగా ఉన్న వారి కుల వృత్తులను ప్రోత్సహించలేదని తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కుర్మలకు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి 18 సంవత్సరాలు నిండిన 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో రూ. లక్ష రూపాయలతో 70 శాతం రాయితీగా అందిస్తుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో గొల్ల, కుర్మలకు ఇప్పటికీ అందించిన 1కోటి 50 లక్షలు గొర్రెల యూనిట్లను అందించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. జనగామ జిల్లాలో 1లక్ష గొర్రెలు అం దించామని వాటికి 7 వేల గొర్రె పిల్లలు జన్మించాయన్నారు. కుర్మల తెలివి ముందు ఏ చాటె డ్ అకౌంట్ గాని, వ్యాపరస్తులుగాని సాటిరాదన్నారు. అభివృద్ధి అంటే హైదరాబాద్ కాదని మారు మూల గ్రామాలు అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ అన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా 90 శాతం గ్రామలకు ఇంటింటికి మంచి నీటిని అందించామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడికలు తీసి గోదావరి జలాలతో నింపి రైతులకు సాగునీరు అందిస్త్తామని వచ్చే వర్షాకాలం నాటికి లిం గాల మండలంలో ప్రతి చెరువులు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, పాలమూర్ ఎత్తి పోతల పథకంపై కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్రీదేవసేన, గిరిజన సహకార సంస్థ చైర్మెన్ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గె మల్లేశం, జనగామ, లింగాలఘన్‌పూర్ జెడ్పిటిసిలు బాల్దె విజయ , గంగసాని రంజిత్‌రెడ్డి, జనగామ మార్కేట్, మున్సిపల్, చైర్‌పర్సన్‌లు బండ పద్మ, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఎంపిపి బోయిని షిరీశరాజు, చేవెల్లి సంపత్, రవిందర్‌రావు, చిట్ల ఉపెందర్‌రెడ్డి, వివిద గ్రామాల ఎంపిటిసిలు, సర్పం చులు గంగసాని బాగ్యమ్మ, గ్రామాల టిఆర్‌ఎస్ అధ్యక్షులు బైరు యాకన్న వివిద గ్రామాల గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.

Comments

comments