Search
Monday 11 December 2017
  • :
  • :

భూ సమస్యల పరిష్కారం కోసమే రికార్డుల ప్రక్షాళన : ఎస్‌పి సింగ్

ydd

వలిగొండ: రాష్ట్రంలో రైతులకు చెందిన భూ సమస్యల పరిషారం కోసమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సిఎం కెసిఆర్ చొరవతో ఒక ఉద్యమంలా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్.పి.సింగ్ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు నేరుగా గ్రామసభల్లో పాల్గొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వలిగొండ మండ లంలోని 35 రెవెన్యూ గ్రామాలకు 30 గ్రామాల్లో ప్రక్షాళన పూర్తయిందన్నారు. అనంతరం భూముల వివ రాలను ఆన్‌లైన్ నమోదు చేసి బి1 పట్టాలను రైతులకు 2018 జనవరి 26 తేది తరువాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని, పాస్ పుస్తకాలను ఆన్‌లైన్ ద్వారా బ్యాంకులకు అనుసంధానం చేయను న్నట్లు వివరించారు. రైతుల పాస్ పుస్తకాలలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను సెత్వార్, కాస్ర పహణీ నకల్ ఆధారంగా సవరించాలని సూచించారు. అలాగే గ్రామాల్లోని ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్ భూములను గుర్తించి రెండ విడతలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 70 శాతం, మండలంలో 95 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు తెలిపారు.

Comments

comments