Search
Sunday 21 January 2018
  • :
  • :

హరీశ్‌రావును కలిసిన గ్రామ రైతు సంఘం నాయకులు

harish

మన తెలంగాణ/గుమ్మడిదల : పంట పండాలంటే నీరే ఆధారం. ఆ నీరే లేకుంటే రైతు అనే వాడు చరిత్రలో మాత్రమే కనబడతాడు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాయగూరలు పండించడంలో గుమ్మడిదల మండ లం మంచి పేరు సాధించింది. కానీ ఈసారి వర్షాలు సరిగా పడనందున పంటలు సరిగా పండలేదు. అంతకు ముందు ఏడు కూడా వరుసగా 3 సంవత్సరాలు వర్షాలు పూర్తిగా మొహం చాటేయటంతో రైతులు ఘోరంగా నష్టపోయారు. దీనితో గరిష్టంగా చాలా మంది రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఏడు వర్షాలు కూడా రైతులను మోసం చేసాయి. బోరు మోటారుపై ఆధారపడ్డ రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మొత్తంగా అందరి స్థితి ఒకే మాదిరిగా ఉంది. ఒకవేళ గత సంవత్సరాల లాగే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే బోర్లు వేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయం ఉంది. అంతే కాకుండా బోర్లు వేయించడానికి రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర రైతులందరికీ గరిష్ఠ ప్రయోజనం కలిగించాలని ఒక భగీరథ స్వప్నంతో మన ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారు. రైతుల అభివృద్ధ్దిని బలంగా కాంక్షించే మన ముఖ్యమంత్రి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చాలా పథకాలను రూపకల్పన చేసారు. రైతులు అభివృద్ధే లక్షంగా ముందుకు వెళుతున్నారు. రైతులకు అతి ముఖ్యమైనటువంటి నీరును అందించడానికి ఏ ముఖ్యమంత్రీ చేయనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగం గా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా పక్కనే ఉన్న నర్సాపూర్ నియోజక వర్గ రైతులకు నీరు అందిస్తున్నారు. గుమ్మడిదల రైతుల బాధలను గుర్తించి ఆ పథకాన్ని ఇక్కడి వరకు పొడిగించి వీరికి సాగు నీరు అందించి వీరి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దీనితో ఇక్కడి చెరువులు, కుంటలు నిండి ఇక్కడి రైతులు పడుతున్న కష్టాలు తీరుతాయి. అంతే కాకుండా అప్పుల ఊబిలో పడకుండా రైతుల కుటుంబాలు సంతోషంగా జీవిస్తారు. ఈ సమస్యలిన్నంటినీ ఊటంకిస్తూ గుమ్మడిదల మండల రైతుల తరుపున రైతు నాయకులు పోచుగారి చంద్రారెడ్డి, నంద్యాల విష్ణువర్థన్‌రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలసి వినతి పత్రాన్ని ఇచ్చారు. మా సమస్యను మంత్రి పరిష్కరిస్తారని రైతు నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

Comments

comments