Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

క్షయవ్యాధిని తరిమికొడదాం

collectorమనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు సైతం క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించగానే కేంద్ర ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భారతిహోళ్లికేరి ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులకు సూచించారు. గురువారం నాడు కలెక్టరేటులోని సమావేశ మందిరంలో క్షయవ్యాధిపై ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహించడం జరిగిందని, గుర్తించిన వ్యాధి గ్రస్తులను ప్రత్యేకంగా చికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు కాకుండా ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైనట్లయితే స్థానికి మెడికల్ అధికారికి సమాచారం అందించాలని, ప్రత్యేకంగా ఏర్పాటు  చేసిన వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేయాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స, మందు కొనుగోలు చేయాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు. క్షయ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, డిసిహెచ్ చంద్రశేఖర్, డిపివో జగన్నాథరెడ్డి, డిఐవో నవీన్‌కుమార్‌లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments