Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

లారీ, ఆటో ఢీ

auto
ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
మన తెలంగాణ, వైరాః
వైరా మండలం గండగలపాడు సమీపంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. గరికపాడు నుండి వైరా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆటోలో ఉన్న ప్యాసింజర్లు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments