Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

టోల్ ప్లాజా మహిళా ఉద్యోగిపై దాడి!

Man-beat-Female-Toll-Plaza-

గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్ ఫీజు అడిగినందుకు ఉద్యోగినిపై దాడి చేశాడో వాహనదారుడు. ఈ ఘటన గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. గుర్గావ్ హైవేపై ఉన్న ఖేర్కి దులా టోల్ ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి వాహనం రాగానే టోల్ ఫీజు చెల్లించాలని అడిగింది. దాంతో నన్నే టోల్ ఫీజ్ అడుగుతావా అంటూ వాహనం దిగి ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. అక్కడున్న సిబ్బందిని బూతులు తిట్టాడు. ఇది చూసిన మిగతా ఉద్యోగులు అక్కడకు రావడం గమనించిన సదరు వ్యక్తి వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టి పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Man attempts to Beat a Female Toll Plaza Employee in Gurugram.

Comments

comments