Search
Friday 20 April 2018
  • :
  • :

మందకృష్ణ అరెస్ట్.. కెసిఆర్ పాలనకు మచ్చుతునక

chair

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నా కెసిఆర్ నేడు దళితుల హక్కుల కోసం పోరా డుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కెసిఆర్‌కు దళి తుల పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థమౌతుందని ఈ సంఘటన కెసిఆర్ పాలనకు మచ్చు తునక అని టిడిపి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు ,మాజీ ఎంఎల్‌ఎ రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మభ్యపెట్టిన కెసిఆర్ వారిని ఉధ్యమంలోకి తీసుకొని యువత ఆత్మబలిదానాల కార ణంగా సాధించిన తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక పోగా కెసిఆర్ కుటుంబంలోని కూతురు,అల్లుడు, కొడుకుకు మాత్రం రాజకీయ కొలువులు లభించాయని ఆయన మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో ఏనాడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చిన చరిత్ర లేదని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామ ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, కేవలం 17 వందల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని ఇండ్లు లేని పేద ప్రజలకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని ప్రకటించిన ము ఖ్యమంత్రి వాటి ఊసే ఎత్తడం లేదని డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించేం దుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని పేర్కొంటు తప్పించుకుం టున్నారని అన్ని హంగులతో ప్రగతి భవన్‌ను నిర్మించుకుంటున్న ము ఖ్యమంత్రి పేదల ఇండ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదా అని ఆయన ప్రశ్నించారు.
వంద ఏళ్ల ఉస్మానియా చరిత్ర ఉత్సవాల సంబరాల్లో టిఆర్‌ఎస్
ప్రభుత్వ పెద్దలకు చోటు లేకపోవడం: బాధాకరమని ఎన్నో ఆశలతో తమ ప్రాణాలను పోగొట్టుకున్న యువత ఆత్మ క్షోభిస్తుందని ఆయన అ న్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయకుండానే తెలుగు మహాసభలను నిర్వహించడం కెసిఆర్ ప్రభు త్వం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.తెలుగు భాషను ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందని ,తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేసి న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరును మరిచి పోవడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి సచివాలయంలోని కొన్ని శాఖలకు సంబంధించిన సమత, మమత వంటి విభాగాలకు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నామకరణం చేశారని ఆయన గుర్తు చేశా రు. జనవరి 1 నుండి టిడిపి నాయకులకు ,కార్యకర్తలకు హైద్రాబాద్‌లో ని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో గ్రూప్‌లో 150 మంది చొప్పున రెండు రోజు ల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్టత , తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు. అంతకు ముందు ఉదయం నడకలో భాగంగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పట్టణ వాసులతో కలిసి పాల్గొని పట్టణ సమస్య లు తదితర అంశాలపై చర్చించారు. విలేకరుల సమావేశంలో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల టిడిపి అధ్యక్షులు బి.రాములు, డా.శ్రీనివాస్‌రెడ్డి, వనపర్తి జడ్పిటిసి వెంకటయ్యయాదవ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఉంగ్లం తిరుమల్, కౌన్సిలర్ నందిమల్ల శారదా, టిడిపి పట్టణాధ్యక్షులు నంది మల్ల అశోక్, నాయకులు కాగితాల గిరి, నందిమల్ల రామస్వామి, బం డారు గోపాల్,రాజు, తదితరులు ఉన్నారు.

Comments

comments