Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

మావోల పోస్టర్ల కలకలం

Maoists

 

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద మావోయిస్టుల పోస్టర్లు వెలవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు గ్రామ గ్రామాన పిఎల్ జిఎ-17 వారోత్సవాలను విప్లవోత్సహంతో జరుపుకోవాలని మావోలు పిలుపునిచ్చారు. సాయుధ వ్యవసాయక విప్లవంతో ప్రజలను ఐక్యం చెద్దామని పిలుపునిచ్చారు. ప్రజా శత్రువులైన పోలీస్ ఏజెంట్లు, ఇన్ఫార్మర్లను దండించాలని పోస్టర్లలో పేర్కొన్నారు. బ్రాహ్మణీయ హిందూ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని, గ్రామ గ్రామాన రక్షక దళాలు ఏర్పాటు కావాలని మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటి పేరుతో పోస్టర్లు వెలిశాయి.

 

 

 

Comments

comments