Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కాంతినిచ్చే మెుక్కలు

Lighting-tress

కృత్రిమ కాంతి (బయో లుమినిసెంట్)ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా మసాచూస్సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు వెలుగులు అందించే మొక్కలను తయారుచేశారు. వాటర్‌క్రెస్ మొక్కల ఆకులకు ప్రత్యేకమైన నానో పదార్థ తంత్రుల ఎఫెక్ట్‌తో వాటర్‌క్రెస్ మొక్క దాదాపు నాలుగ్గంటల పాటు వెలుగును ఇచ్చినట్లు తెలిపారు. మొక్క నుంచి వచ్చిన కాంతితో పుస్తకాన్ని చదవగలిగామన్నారు. ఇదే తరహాలో పెద్ద మొక్కలపై ప్రయోగాలు చేసి పెద్ద ఎత్తున కృత్రిమ కాంతిని సృష్టించాలని యోచిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. లుసిఫెరాసిస్ అనే నానో పదార్థ కృత్రిమ కాంతి సృష్టిలో కీలకపాత్ర పోషిస్తుంది. లుసిఫెరాసిస్‌ను స్వయం ప్రకాశిత జీవుల్లో పరిశోధకులు గుర్తించారు. దానిపై అనేక ప్రయోగాలు చేసి కెమికల్ రియాక్షన్ ద్వారా లుసిఫెరాసిస్‌ను ఆక్సీలుసిఫెరాసిస్‌గా మార్చారు. దీన్నుంచి అధిక కాంతి వెలువడటంతో కృత్రిమ కాంతిని సృష్టించవచ్చనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. అనంతరం వాటర్‌క్రెస్ మొక్కలపై ప్రయోగాలు చేసి సఫలీకృతమయ్యారు. దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టవచ్చని చెబుతున్నారు.

Comments

comments