Search
Monday 11 December 2017
  • :
  • :

ఢిల్లీ టెస్టు: మాథ్యూస్ సెంచరీ 

Angelo-Mathews

న్యూఢిల్లీ: వేదికగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏంజిలో మాథ్యూస్ శతకం నమోదు చేశాడు. 231బం తుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో మాథ్యూస్(103) పరుగులు చేశాడు. 6 పరుగుల వద్ద కోహ్లీ సునాయాసన క్యాచ్‌ను వదిలిపెట్టగా, 98 పరుగుల వద్ద రోహిత్ మరో క్యాచ్ జారవిడిచాడు. ఇలా రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మాథ్యూస్ సెంచరీ కొట్టాడు. మాథ్యూస్‌కు కెప్టెన్ దినేష్ చండీమల్ నుంచి సహకారం లభించడంతో సిరీస్‌లో తొలిసారి టీమిండియా బౌలర్లను నిలువరించగలింది శ్రీలంక. ఇప్పటికే ఈ ద్వయం అజేయంగా 170 పరుగుల భాగస్వామ్యం అందించింది. 131/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. పీచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో భారత బౌలర్లు వికెట్ పడగొట్టడానికి కష్టపడాల్సి వస్తోంది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్(109), చండీమల్(84) ఉండగా… శ్రీలంక స్కోర్: 246/3(94 ఓవర్లు).

Comments

comments