Search
Tuesday 19 June 2018
  • :
  • :

పద్దెనిమిది వందల కోట్లతో మెదక్ నియోజక అభివృద్ధి

public

మనతెలంగాణ/రామాయంపేట : మెదక్ నియోజక వర్గాన్ని 18వందల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు ఆమె రామాయంపేటకు చేరుకుని మొదట వైకుంఠ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడి శ్రీవెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఇట్టి ఉత్సవాల్లో ఆమె పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు పక్కన నిర్మించ తలపెట్టి డబుల్ బెడ్‌రూం ఇళ్ల  స్థలాన్ని ఆమె పరిశీలించారు. మరింత వేగంగా పనులు అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అంతకు ముందు ఆమె స్థానిక  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల అభివృద్ధ్దే ధ్యేయంగా పని చేస్తున్నాడని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను త్వరలో పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్, మే మాసం కల్లా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తాయన్నారు.

2018 ఆఖరి కల్లా హల్దీకి అట్టి నీటిని అందిస్తామన్నారు. రాష్ట్రంలో గత 60 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధ్ది కేవలం మూడున్నర ఏళ్లలో జరిగిందని చెప్పారు. ఇందుకు ముఖ్య మంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే రైతులకు పంట సాగు నిమిత్తం పెట్టుబడికి గాను ఎకరానికి 4వేల  రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించుటకు, గొర్ల కాపరులకు అభివృద్ధ్దికి గొర్రెలను పంపిణీ, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందివ్వటానికి ఈయోడాదే నిర్ణయం తీసుకుని అమలు చేసిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. అలాగే రైతులకు 24 గంటల  నాణ్యమైన కరెంట్‌ను సాగుకు ప్రభుత్వం అందిస్తుందని, భూగర్భ జలాలు త్వరగా అడగంటకుండా ఉండేందుకు గాను రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోవాలని డిప్యూటీ స్పీకర్  సూచించారు. మెదక్‌లో ఇప్పటికే బిసి రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలు ఉన్నాయని, మరి ఎస్‌సి, ఎస్‌టి మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అలాగే నాలుగు హైవేలు మంజూరయ్యాయని అందులో బాలానగర్-మెదక్- బోధన్ వరకు, మెదక్ -సిద్దిపేట- హాసన్‌పర్తి వరకు మారో హైవే మంజూరి అయ్యిందన్నారు. ఇట్టి పనుల ను త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మరి నాలుగవ విడత మిషన్ కాకతీయ పనులకు త్వరలో టెండటర్లను ప్రకటిస్తారన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా భూ సమస్యలు ఇక తీరినట్లేనని ఆమె తెలిపారు. వచ్చే యేడాది నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపిపి పుట్టి విజయల, వైస్ ఎంపిపి జితేందర్‌గౌడ్, జెడ్‌పిటిసి బిజ్జ విజయలక్ష్మి.పేట సర్పంచ్ పాతూరి ప్రభావతి, ఉప సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, వార్డు సభ్యులు దేమె యాదగిరి, నవాత్ కిరణ్, మాజీ జెడ్‌పిటిసి సరాఫ్ యాదగిరి, టిఆర్‌ఎస్ పట్టనాధ్యక్షుడు పుట్టి యాదగిరి, రైతు సమన్వయ జిల్లా కమిటీ డైరెక్టర్ బాజ చంద్రం, నాయకులు బసన్నపల్లి రాజు, పోచమ్మల శ్రీనివాస్, స్వామి, ఐలయ్య, బాసం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Comments

comments