Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కమోడిటీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎంఎఫ్ మేనేజర్లకు అనుమతి!

bsns

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్, పోర్ట్‌పోలియో మేనేజర్లు ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి ఇచ్చే విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కమోడిటీలో కూడా పెట్టుబడులను విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ ఆలోచన చేస్తోంది. సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్జ్ ఆఫ్ ఇండియా) కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టింది. రెండేళ్ల క్రితం సెబీ కమోడిటీకి అవసరమైన భద్రతా ప్రమాణాలను చేపట్టింది. ఈ సెగ్మెంట్‌లో ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌ను అనుమతించే దిశగా చర్యలను వేగవంతం చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. సెబీతో విలీనానికి ముందు ఎఫ్‌ఎంసి(ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్) కమోడిటీలో పాల్గొనేవారిని నియంత్రించనుంది. ఇప్పటికే స్టాక్ కమోడిటీ ఎంతో వేగవంతంగా ఉంది. ఇదే విధంగా కమోడిటీస్‌ను తీసుకువస్తే ఇన్వెస్ట్‌మెంట్ పరిధి పెంచవచ్చన్నది మార్కెట్ నియంత్రణ సంస్థ అభిప్రాయంగా ఉంది. కమోడిటీస్‌తో ఇన్వెస్టర్లకు మరింత లాభాలు, దీని ద్వారా మరింతగా అవకాశాలు కల్పించాలని చూస్తోంది.

Comments

comments