Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

భారీ బ్యాటరీతో మైక్రోమ్యాక్స్ ‘భారత్-5’

Micromax-Bharat-5ముంబయి: దేశీయ మొబైల్ తయారీదారు సంస్థ మైక్రోమ్యాక్స్ తాజాగా ‘భారత్-5’ పేరిట కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. శుక్రవారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన ఈ 4జి మొబైల్ ధర కేవలం రూ. 5555 మాత్రమే. భారత్ సిరీస్‌లో వచ్చిన ‘భారత్-5’లో ప్రత్యేకత దీన్ని బ్యాటరీ. మైక్రోమ్యాక్స్ ఏకంగా దీనికి 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఇచ్చింది. ఇది సుమారు 3 వారాల స్టాండ్‌బై టైం ఇస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే వొడాఫోన్‌తో భాగస్వామ్యంలో డేటా ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ ద్వారా 50జిబి డేటా ఉచితంగా పొందవచ్చు. ఐదు నెలలపాటు నెలకు 10జిబి చొప్పున వినియోగదారునికి డేటా వస్తుంది. అయితే, ఆఫ్‌లైన్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్ సిరీస్‌లో… భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా, ‘భారత్-5’ను మార్చి 2018 నాటికి ఆరు లక్షల యూనిట్లు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మైక్రోమ్యాక్స్ ‘భారత్-5’ ఫీచర్ల విషయానికి వస్తే…
5.2 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే(1280×720పి రిజూల్యూషన్)
1.3 క్వాడ్ కోర్ మెడిటెక్ ప్రాసెసర్
1జిబి ర్యామ్
16జిబి రొమ్(64జిబిల వరకు విస్తరించుకునే సదుపాయం)
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
5000 ఎంఎహెచ్ బ్యాటరీ
సెల్పీ, వెనక కెమెరాలు రెండు 5మెగా పిక్సెల్ సెన్సార్ (ఎల్‌ఇడి ఫ్లాష్)

Comments

comments