Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి అల్లోల

walk

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : రబీ పంట కోసం సోమవారం రాష్ట్ర గృహానిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదిగా ఎస్‌ఆర్‌ఎస్‌సి నుండి సరస్వతి కాలువ ద్వారా 500 క్యూ సెక్కూల నీటిని  విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువ ద్వారా సుమారు 1600 ఎకరాల సాగుకు నీరు అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. అనంతరం శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాదాపూర్ చ ర్చిలో పాల్గొని ప్రార్థనాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా జా యింట్ కలెక్టర్ శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పల గ ణేష్ చక్రవర్తి, సత్యనారాయణగౌడ్, ఎస్‌ఆర్‌ఎస్‌సి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

comments