Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

అదృశ్యమైన బాలిక హత్య

Girl

పెద్దగూడెం: అదృశ్యమైన బాలికను హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంజనేయులు-కల్పనల దంపతుల కూతురు నాగేశ్వరి ఆదివారం అదృశ్యమైంది. తల్లిదండ్రులు కుమార్తె కోసం వెతకగా కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గ్రామస్థులు, పోలీసులు గాలింపు చేపట్టగా బురాన్ స్వామి ఇంటి ముందు నాగేశ్వరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు శవ పరీక్ష నిమిత్తం బాలిక మృతదేహాన్ని వనపర్తి ఎరియా ఆస్పత్రికి తరలించారు.  క్షుద్రపూజల కోసం బాలికను బురాన్ స్వామి బలి చేసి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments