Search
Monday 11 December 2017
  • :
  • :

ప్రపంచ తెలుగు మహాసభలకు పెద్ద సంఖ్యలో కవులు

mike

మన తెలంగాణ / మేడ్చల్ : ఈ నెల 15వ తేదీ నుండి జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ప్రముఖ కవి శివకుమార్ పిలుపునిచ్చారు. మేడ్చల్‌లో శనివారం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం మేడ్చల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాల విశిష్టతను ప్రపంచ తెలుగు మహాసభల వేదిక బయటి ప్రపంచానికి చెప్పేప్రయత్నం  జరుగుతుందని ఆయన చెప్పారు. కవులు కళాకారులు, రచయితలు ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.

Comments

comments