Search
Wednesday 23 May 2018
  • :
  • :

పసికందును చంపిన కసాయి తల్లి

ARTI

లక్నో : మూడు నెలల పసికందును ఓ కన్న తల్లి దారుణంగా చంపేసింది. ఈ ఘటనలో యుపిలోని ఘజియాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్తి అనే ఓ మహిళ మూడు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మగ పిల్లాడు కావాలనుకుంటే, ఆడపిల్ల పుట్టిందన్న ఆందోళనకు గురైన ఆర్తి ఆ పసికందు మొహంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆ శిశువు మృతదేహాన్ని వాషింగ్ మెషిన్‌లో దాసి, తన కూతురును ఎవరో కిడ్నాప్ చేశారని ఆర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన ఆ శిశువు తల్లిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తానే తన కూతురుని చంపినట్టు ఆర్తి అంగీకరించింది. ఆర్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు విచారిస్తున్నారు.

Mother killed her baby

Comments

comments